జమ్మలమడుగును మరింత అభివృద్ధి చేస్తాం : ఎంపీ

ABN , First Publish Date - 2022-10-01T05:28:40+05:30 IST

జమ్మలమడుగు నియోజవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎంపీ అవినా్‌షరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎర్రగుంట్ల మార్కెట్‌యార్డు పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి కడప మేయర్‌ సురే్‌షబాబు, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు.

జమ్మలమడుగును మరింత అభివృద్ధి చేస్తాం : ఎంపీ

ఎర్రగుంట్ల, సెప్టెంబరు 30: జమ్మలమడుగు నియోజవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎంపీ అవినా్‌షరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఎర్రగుంట్ల మార్కెట్‌యార్డు పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి కడప మేయర్‌ సురే్‌షబాబు, ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి గౌరవ చైర్మన్‌గా ఉన్న ఎర్రగుంట్ల మార్కెట్‌యార్డు పాలకమండలిని సెక్రటరీ రత్నరాజు ప్రమాణస్వీకారం చేయించారు.ఈకార్యక్రమంలో నగరపంచాయతీ ఛైర్మన్‌ ఎం.హర్షవర్దన్‌రెడ్డి, జడ్పీటీసీ బాలయ్య, వైసీపీ నాయకులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. కాగా ఎర్రగుంట్ల నగరపంచాయతీలో పలు అభివృద్ధి పనులను ఎంపీ వైయ్‌స.అవినా్‌షరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, ఆర్టీసీ చైౖర్మన్‌ మల్లికార్జునరెడ్డి, చైర్మన్‌ ఎం.హర్షవర్దన్‌రెడ్డి ఆర్టీసీ ఆర్‌ఎం, ప్రొద్దుటూరు డీఎం మధు తదితరులు పాల్గొన్నారు.

Read more