‘అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం’

ABN , First Publish Date - 2022-09-12T05:04:46+05:30 IST

వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు పేర్కొన్నారు.

‘అక్రమ కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం’
మాట్లాడుతున్న నల్లబోతుల నాగరాజు

ప్రొద్దుటూరు టౌన్‌, సెప్టెంబరు 11 : వైసీపీ నాయకుల అక్రమాలు, దౌర్జన్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లబోతుల నాగరాజు పేర్కొన్నారు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ నాయకుల అక్రమాలు, అన్యాయాలను గట్టిగా ప్రశ్నిస్తున్నందునే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిపై కక్షగట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌లో తిరుగుతున్న ఓ వ్యక్తిని సిబ్బంది ప్రశ్నిస్తుంటే తెలుసుకుని ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చి అప్పగించారన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడమేగాక, ఫిర్యాదును రెండు మూడు సార్లు మార్పు చేశారని తెలిపారు. మాజీ మంత్రి కొడాలి నాని ప్రజలు మరిచిపోకుండా ఉండేందుకు బూతులు మాట్లాడుతున్నారని, మరో సారి చంద్రబాబు కుటుంబాన్ని విమర్శిస్తే ఆయన ఇంటిని ముట్టడిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  తెలుగు యువత జిల్లా అధికార ప్రతినిధి ఎన్‌.శివరామ్‌, తెలుగు యువత అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు నవీన్‌కుమార్‌రెడ్డి, ఎస్సీ నాయకులు బండి రాజశేఖర్‌, సంబటూరు సురేష్‌ పాల్గొన్నారు. 


Read more