బడికి రాలేకపోతున్నాం.. బస్సు పునరుద్ధరించండి

ABN , First Publish Date - 2022-10-15T05:14:50+05:30 IST

ఆర్టీసీ బస్సు సర్వీసును రద్దు చేయడంతో బడికి వెళ్లలేకపోతున్నామని బోనమల గ్రామానికి చెందిన విద్యార్థులు ఎమ్మెల్యేకు విన్నవిం చారు.

బడికి రాలేకపోతున్నాం.. బస్సు పునరుద్ధరించండి

చిన్నమండెం, అక్టోబరు14: ఆర్టీసీ బస్సు సర్వీసును రద్దు చేయడంతో బడికి వెళ్లలేకపోతున్నామని బోనమల గ్రామానికి చెందిన విద్యార్థులు ఎమ్మెల్యేకు విన్నవిం చారు. చిన్నమండెం- 1, 2 సచివాలయాల పరిధిలోని మాలపల్లె, కలిబండరోడ్డు, మోతీనగర్‌,  బీసీకాలనీ, బస్టాండు ఏరియా, బలిజపల్లెల్లో ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్గి గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆయనకు సమస్యను విన్నవించారు. దీంతో ఎమ్మెల్యే డిపో మేనేజర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బస్సు ఏర్పాట్లు చేస్తానని పిల్లలకు హామీ ఇచ్చారు.  సర్పంచులు, ఎంపీటీసీ సభ్యు లు,  మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు

Read more