వీఆర్వో పొరపాటుతో భూములు కోల్పోతున్నాం

ABN , First Publish Date - 2022-09-13T05:42:13+05:30 IST

వాల్మీకి పురంలో వీఆర్‌వో చేసిన పొరపాటుతో విలువైన భూములు కోల్పోతున్నామని బా ధితుడు జర్రావారిపల్లెకు చెంది న మల్లికార్జున ఆర్డీవోకు మురళి కి మొరపెట్టుకున్నాడు.

వీఆర్వో పొరపాటుతో భూములు కోల్పోతున్నాం




మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 12: వాల్మీకి పురంలో వీఆర్‌వో చేసిన పొరపాటుతో విలువైన భూములు కోల్పోతున్నామని బా ధితుడు జర్రావారిపల్లెకు చెంది న మల్లికార్జున ఆర్డీవోకు మురళి కి మొరపెట్టుకున్నాడు. సోమవా రం స్థానిక సబ్‌కలెక్టరేట్‌ లో నిర్వహించిన స్పందన కార్యక్రమా నికి 36 మంది అర్జీదారులు వారి సమస్యలు విన్నవించుకున్నారు. జర్రావారి పల్లెకు చెందిన సి.చిన్నప్ప కుమారుడు మల్లికార్జునకు తాతల కాలం నుంచి పిత్రా ర్జితంగా భూములు వచ్చి అనుభవంలో ఉన్నా  తన వద్ద అన్ని రికా ర్డులు ఉన్నా 2017 సంవత్సరంలో పనిచేసిన వీఆర్వో ఈ భూములను ఇతరు ల పేరు మీద పాసుపుస్తకం మంజూరు చేశాడని ఫిర్యాదులో పేర్కొ న్నాడు.

వృద్ధాప్య చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు

వృద్ధ్యాప్య చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆర్డీవో మురళి హెచ్చరిం చారు. సోమవారం సబ్‌కలెక్టరేట్‌లో సీనియర్‌ సిటిజెన్స్‌ కోర్టులో మాలేపాడుకు చెందిన బుడ్డన్న తన కుమారుడు ఆలనా పాలన చూడకుండా ఆస్తులు లాక్కొన్ని కొట్టి తరిమే స్తున్నాడని ఆర్డీవోకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారించిన ఆర్డీవో మాట్లాడుతూ చట్టప్రకారం బుడ్డన్నకు ప్రతి నెలా రూ.3వేలు చెల్లించడంతో పాటు, అతనికి చెందిన భూమికి కౌలు కింద ఏడాదికి రూ.15వేలు చెల్లించాలని బాధితుడు బుడ్డన్న కుమా రుడిని ఆదేశించారు. సీనియర్‌ అసిస్టెంట్‌ శాంతమ్మ పాల్గొన్నారు.

Updated Date - 2022-09-13T05:42:13+05:30 IST