-
-
Home » Andhra Pradesh » Kadapa » Water woes in BC boys hostels-MRGS-AndhraPradesh
-
బీసీ బాలుర హాస్టల్లో నీటి కష్టాలు
ABN , First Publish Date - 2022-09-20T05:28:43+05:30 IST
తంబళ్లపల్లె మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో కొద్ది రోజులుగా విద్యార్థులు తాగు నీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

పైపు లైను మరమ్మతులకు గురవడంతో విద్యార్థులకు అవస్థలు బయట నుంచి బక్కెట్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్న వైనం
తంబళ్లపల్లె, సెప్టెంబరు 19: తంబళ్లపల్లె మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో కొద్ది రోజులుగా విద్యార్థులు తాగు నీటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బీసీ బాలుర వసతి గృహంలో సుమా రు 30 మంది విద్యార్థులు ఉన్నారు. వసతి గృహాంలో విద్యార్థుల నీటి అవసరాలకు పట్టణంలోని ఓ తాగు నీటి బోరు నుంచి నీరు సరఫరా అవుతోంది. అయితే, ఈ బోరు నుంచి వసతి గృహానికి వచ్చే పైపు లైను కొద్ది రోజుల క్రితం మరమ్మతులకు గురైంది. దీంతో విద్యార్థులు స్నానా లు చేయడానికి, బట్టలు శుభ్రం చేసుకోవడానికి ఇతర కనీస అవసరా లకు సరిపడా నీరు లేక తరచూ అవస్థలు పడుతున్నారు. అయితే, పంచాయతీ వారు నాలుగైదు రోజులకొకసారి ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయిస్తున్నామని వసతి గృహ సిబ్బంది చెపుతున్నారు. అయి తే, విద్యార్థుల సంఖ్య, అవసరాల దృష్టా ఆ నీరు ఏ మూలకు సరిపోక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీంతో వసతి గృహం పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ప్రభుత్వ భవనం వద్ద ఉన్న సంపు నుంచి విద్యార్థులు బక్కెట్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలని విద్యార్థుల తల్లితండ్రులు, స్థానికులు కోరుతున్నారు.
ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం
బీసీ సంక్షేమ బాలుర వసతి గృహం వార్డెన్‌గా నాలుగు రోజుల క్రితం వచ్చాను. కొద్ది రోజుల ముందు హాస్టల్‌కు నీరు అందించే బోరు నుంచి వచ్చే పైపు లైను ధ్వంసం అయిందని సిబ్బంది చెప్పారు. అయితే హాస్టల్లో నీరు అవసరమైనపుడు పంచాయతీ వారు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. సోమవారం ఉదయం హాస్టల్‌లో నీరు పూర్తిగా అయిపోయిన విషయం నా దృష్టికి రాలేదు. విద్యార్థులు బయ ట నుంచి బక్కెట్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్న విషయం కూడా తెలియదు. సోమవారం మధ్యాహ్నానానికల్లా వాటర్ ట్యాంకు ద్వారా హాస్టల్ సంపుకు నీటిని సరఫరా చేయించాం. ఒకట్రెండు రోజుల్లో పైపు లైను మర్మతులు చేసి హాస్టల్‌లో నీటి సమస్య శాశ్వతంగా పరిష్కరించ డానికి చర్యలు తీసుకుంటాం.
- సాహీనా బేగం, హాస్టల్ వార్డెన్
