దస్తగిరి చెప్పినవన్నీ అసత్యాలే: భరత్‌ కుమార్‌

ABN , First Publish Date - 2022-02-23T21:39:49+05:30 IST

వైఎస్ వివేకా హత్య కేసు వాంగ్మూలంలో దస్తగిరి చెప్పినవన్నీ అసత్యాలేనని భరత్ కుమార్ అన్నారు.

దస్తగిరి చెప్పినవన్నీ అసత్యాలే: భరత్‌ కుమార్‌

కడప: వైఎస్ వివేకా హత్య కేసు వాంగ్మూలంలో దస్తగిరి చెప్పినవన్నీ అసత్యాలేనని భరత్ కుమార్ యాదవ్ అన్నారు. సీబీఐకి దస్తగిరి ఫిర్యాదు చేసిన అంశాలపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ అందరినీ ఇబ్బంది పెట్టేలా దస్తగిరి వ్యవహరిస్తున్నారని అన్నారు. తాను, న్యాయవాది ఓబుల్‌రెడ్డి దస్తగిరిని ప్రలోభ పెట్టలేదని, ఎలాంటి ఆఫర్లు ఇవ్వలేదని చెప్పారు. దస్తగిరి తనకు ఇవ్వాల్సిన వ్యక్తిగత డబ్బుల గురించి మాత్రమే అడిగానన్నారు. తమకు ఇవ్వాల్సిన డబ్బులు అడిగినా సీబీఐకి చెబుతానంటాడని, మీడియా ముందుకు వస్తే సీబీఐ కేసులు పెడతామంటున్నారని భరత్‌కుమార్‌ అన్నారు. ఇప్పడైనా మీడియా ముందుకు రాకపోతే దస్తగిరి చెప్పిందే నిజం అవుతుందని, విధిలేని పరిస్థితిలో మీడియా ముందుకొచ్చామని, అధికారులు అర్ధం చేసు కోవాలని కోరుతున్నామన్నారు. 164 వాంగ్మూలం తర్వాత తాను దస్తగరితో కలవలేదని భరత్‌కుమార్‌ స్పష్టం చేశారు.

Read more