ఆర్బీకే సందర్శన

ABN , First Publish Date - 2022-11-24T23:24:43+05:30 IST

మండలంలోని వండాడి గ్రామపంచాయతీలోని ఆర్బీకేను జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరి, రాయచోటి ఏడీఏ శ్రీలత సందర్శించారు.

ఆర్బీకే సందర్శన
ప్రకృతి వ్యవసాయ తోటలను పరిశీలిస్తున్న ఉమామహేశ్వరి

చిన్నమండెం, నవంబరు 24: మండలంలోని వండాడి గ్రామపంచాయతీలోని ఆర్బీకేను జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరి, రాయచోటి ఏడీఏ శ్రీలత సందర్శించారు. పంట రుణాలపై ప్రభుత్వం ఇస్తున్న సున్నా వడ్డీపై అధికారులతో చర్చించారు. అలాగే ఈ క్రాప్‌ బుకింగ్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను ఆర్బీకేల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ గీత, ప్రకృతి వ్యవసాయ అధికారులు, ఆర్‌బీకే సెంటర్‌ అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-24T23:24:43+05:30 IST

Read more