ఎండపల్లి భారతికి విమలాశాంతి పురస్కారం

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ బురుజుమాదిగిపల్లెకు చెందిన ఎండపల్లి భారతికి విమలాశాంతి సాహిత్య పురస్కారం వరించింది.

ఎండపల్లి భారతికి విమలాశాంతి పురస్కారం
యండపల్లె భారతి

నిమ్మనపల్లె, సెప్టెంబరు 30: మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ బురుజుమాదిగిపల్లెకు చెందిన ఎండపల్లి భారతికి విమలాశాంతి సాహిత్య పురస్కారం వరించింది. ఈమె ‘ఎదారి బతుకులు’ పల్లె కథలు అన్న పేరుతో 2018లో కథల పుస్తకం వెలువరించారు. ఈ పుస్తకానికి ఇప్పటికే అనేక పురస్కారాలు అందుకున్నారు. తాజాగా విమలాశాంతి పురస్కారం ప్రకటించారు. త్వరలో పురస్కారం ప్రదానం చేయ నున్నామని నిర్వాహకులు శాంతినారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. యండపల్లె భారతి మాట్లాడుతూ తనకు విమలా శాంతి కథా పురస్కారం రావడం ఎంతో సంతోషించదగ్గ విషయమన్నారు.
 

Read more