విద్యార్థి ఠాగూర్‌నాయక్‌ది హత్యే...

ABN , First Publish Date - 2022-07-04T05:22:25+05:30 IST

తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికిబండతాండాకు చెందిన బీటెక్‌ విద్యార్థి మూ డే రెడ్డెప్పనాయక్‌ కుమారుడు ఎం.ఠాగూర్‌నాయక్‌ది ముమ్మటి కి హత్యేనని పోలీసులు తేల్చారు.

విద్యార్థి ఠాగూర్‌నాయక్‌ది హత్యే...

 కాల్‌డేటా ఆధారంగా పోలీసుల దర్యాప్తు ముమ్మరం  మృతదేహం బంధువులకు అప్పగింత

మదనపల్లె క్రైం, జూలై 3: తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ కుతికిబండతాండాకు చెందిన బీటెక్‌ విద్యార్థి మూ డే రెడ్డెప్పనాయక్‌ కుమారుడు ఎం.ఠాగూర్‌నాయక్‌ది ముమ్మటి కి హత్యేనని పోలీసులు తేల్చారు. గుర్తుతెలియని వ్యక్తులు గొంతుకు తీగలు బిగించి హత్య చేశారని పోలీసులు భావిస్తు న్నారు. అదేవిధంగా పోస్టుమార్టం నివేదికలోనూ హత్య జరిగి నట్లు నిర్థారణ అయింది. సంఘటనా స్థలంలో మద్యం బాటి ళ్లు, గంజాయి పొట్లాలు పడిఉండడంతో ఠాగూర్‌ స్నేహితు లు లేదా బాగా తెలిసిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడి ఉంటార ని పోలీసులు భావిస్తున్నారు. ఠాగూర్‌కు మద్యం, గంజాయి తాపించి మత్తెక్కాక..గొంతు నులిమి, తీగలతో బిగించి హత్య చేసి నట్లు స్పష్టంగా తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఇది ముమ్మా టికీ హత్యేనని నిర్థారణ చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలో బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్న అతడు మదనపల్లెలో హత్యకు గురికా వడం పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నమ్మించి వెంట తీసుకెళ్లి మద్యం మత్తులో గొంతుకు తీగలు బిగించి హత్య చేయడంపై అనుమా నాలు రేకెత్తిస్తున్నాయి. దీనికి ప్రేమ లేదా వివాహేతర సంబంధ వ్యవహా రం కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ వ్యవహా రం అయితేనే ఇంత కిరాతకంగా హత్య చేస్తారని పోలీసులు చెబు తున్నారు. ఠాగూర్‌ సెల్‌ఫోన్‌ కాల్‌డేటా ఆధారంగా హత్య కేసు దర్యాప్తు ముమ్మరం చేసినట్లు సీఐ మురళీకృష్ణ చెప్పారు. అయితే ఠాగూర్‌ కుటుంబీకులు పలు అనుమానా లు వ్యక్తం చేస్తున్నారు. వారి నుంచి సేకరించిన అంశా లను పరిగణలోకి తీసుకుని కేసుదర్యాప్తు వేగవంతం చేశామన్నా రు. కాగా కుమారుడి మృతితో ఠాగూర్‌ తల్లిదండ్రులు విషా దంలో మునిగి పోయారు. ఈ ఘటనతో కేబీతాండాలో విషా దం అలుముకుంది. మదనపల్లె శివారులో అనుమానాస్పదస్థితి లో విద్యార్థి ఠాగూరు మృతిచెందిన విషయం  శనివారం ఆల స్యంగా వెలుగు చూడడంతో టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన వస్తూ.. గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో ఆదివారం సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహా న్ని బంధువులకు అప్పగించారు. కాగా విద్యార్థి ఠాగూర్‌ గొంతుకు తీగలు బిగించి ఉండడంతో అనుమానం మరింత బలమైంది. 

Read more