వేంకటేశ్వరాలయ నిర్మాణానికి రూ.1,11,111 విరాళం

ABN , First Publish Date - 2022-04-25T05:00:53+05:30 IST

పెద్దూరు బ్రాహ్మణవీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం రేవనూరి రాజ్‌కుమార్‌ ఆదివారం రూ.1,11,111 మొత్తాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు.

వేంకటేశ్వరాలయ నిర్మాణానికి రూ.1,11,111 విరాళం
వెంకటేశ్వరస్వామి గుడికి విరాళం అందజేస్తున్న దాతలు

గాలివీడు, ఏప్రిల్‌ 24: పెద్దూరు బ్రాహ్మణవీధిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం నిమిత్తం రేవనూరి రాజ్‌కుమార్‌ ఆదివారం రూ.1,11,111 మొత్తాన్ని కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.  కమిటీ సభ్యులు మాట్లాడుతూ జూన్‌లో నిర్వహించనున్న  విగ్రహ ప్రతిష్ట ఉత్సవానికి దాతలు, ప్రజలు పెద్ద ఎత్తున సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌, ఆర్యశంకర్‌, సీఎస్‌ రెడ్డి, వెంకటేష్‌, యద్దయ్య, రామకృష్ణారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, రేవనూరి రాజ్‌కుమార్‌, సత్య, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Read more