-
-
Home » Andhra Pradesh » Kadapa » ukanya Samriddhi Yojana to ensure child welfare-NGTS-AndhraPradesh
-
్ఠఆడబిడ్డల భరోసాకు ‘సుకన్య సమృద్ధి యోజన’
ABN , First Publish Date - 2022-09-13T05:43:49+05:30 IST
పోస్టాఫీసుల్లో సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆడపిల్లల పేరుతో పొదుపు చేసు కుంటే 21 ఏళ్ల వయసొచ్చాక పై చదువులకు లేక వివాహాలకు భరోసా లభిస్తుందని కలికిరి సర్పంచు ప్రతాప్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

కలికిరి, సెప్టెంబరు 12: పోస్టాఫీసుల్లో సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఆడపిల్లల పేరుతో పొదుపు చేసు కుంటే 21 ఏళ్ల వయసొచ్చాక పై చదువులకు లేక వివాహాలకు భరోసా లభిస్తుందని కలికిరి సర్పంచు ప్రతాప్ కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక గ్రా మ పంచాయతీ కార్యాలయంలో సుకన్య సమృద్ధి యోజన పొదుపు ఖాతాలపై జరిగిన సమావేశంలో అప్పటికప్పుడు ఖాతాలకు దరఖాస్తులు చేసుకున్న 50 మంది పేద పిల్లల పేరుతో రూ.250 వంతు న ఖాతా ప్రారంభ రుసుం సర్పంచ్ ప్రతాప్‌కుమార్‌రెడ్డి స్వంత నిధులతో చెల్లించారు. వాల్మీకిపురం పోస్టల్ ఇన్‌స్పెక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ రూ. 25 నుంచి ప్రతి రోజు లేక ప్రతి నెలా లేదా ఏడాదిలో ఎప్పుడైనా రూ.1.50 లక్షల వరకూ ఆడపిల్లల పేరుతో పోస్టాఫీసుల్లో జమచేయవచ్చని వివరించారు. పదేళ్ళ లోపు ఆడపిల్లల పేరుతో నెలకు రూ.వెయ్యి వంతున 15 ఏళ్లపాటు జమ చేస్తే 21 సంవత్సరాల తరు వాత రూ.5.10 లక్షలు చెల్లిస్తా మని చెప్పారు. స్థానిక సబ్ పోస్ట్ మాస్టర్ నిరంజన్ కుమార్, వాల్మీకిపురం ఐసీడీఎస్‌కు చెందిన సీడీపీవో కృష్ణమంజరి, ఏసీడీపీవో రోహిణి, మండలంలోని బ్రాంచి పోస్ట్ మాస్టర్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, హాజరయ్యారు.