గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇరువురు అరెస్టు

ABN , First Publish Date - 2022-10-04T05:36:52+05:30 IST

గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఇరువురిని సిద్దవటం పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి గంజాయి, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌.. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు.

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇరువురు అరెస్టు
మీడియాకు వివరాలు వెల్లడిస్తున్నఎస్పీ అన్బురాజన్‌, చిత్రంలో డీఎస్పీ

11.600 కేజీల గంజాయి, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం

వివరాలను వెల్లడించిన ఎస్పీ 

కడప(క్రైం), అక్టోబరు 3: గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఇరువురిని సిద్దవటం పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుంచి గంజాయి, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌.. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి, చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రం పలక్కడ్‌ జిల్లా యరాచ్చి డాడ్జి హౌస్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ నశీం, కేరళ రాష్ట్రం, పాలక్కడ్‌ జిల్లా, కారకురిప్సి మండలం, మలంబల్ల గ్రామానికి చెందిన అజ్మల్‌లు రాజమండ్రిలో గంజాయి కొనుగోలు చేసి అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. దీంతో ఒంటిమిట్ట ఇన్‌ఛార్జ్‌ సీఐ అశోక్‌రెడ్డి, సిద్దవటం ఎస్‌ఐ తులసినాగప్రసాద్‌లు తన సిబ్బందితో కనుమలోపల్లి గ్రామం వద్ద నిఘా ఉంచి ఆ ఇరువురినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి 11 కేజీల 600 గ్రాముల గంజాయి, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. గంజాయి ఎవరైనా కలిగి ఉన్నా, విక్రయించినా వారితో పాటు వారికి సహకరించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు హిస్టరీ షీట్లు తెరుస్తామని, పదే పదే నేరాలకు పాల్పడితే  పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఇవ్వాలని కోరారు.

Read more