అమెరికాలో పర్యటించడం గొప్ప అనుభూతి

ABN , First Publish Date - 2022-05-31T05:27:20+05:30 IST

భారతదేశంలో అమలవుతు న్న బాలల హక్కులు, చట్టా లు, బాల్యవివాహాల నిర్మూలన అంశాలపై అమెరికాలో పర్యటించడం గొప్ప అనుభూ తినిచ్చిందని పోర్డు సంస్థ సీఈవో లలితమ్మ పేర్కొన్నా రు.

అమెరికాలో పర్యటించడం గొప్ప అనుభూతి
న్యూయార్క్‌ సదస్సులో సినీనటుడు వివేక్‌ ఒబెరాయ్‌తో కలసి పాల్గొన్న పోర్డు లలితమ్మ

మదనపల్లె టౌన్‌, మే 30: భారతదేశంలో అమలవుతు న్న బాలల హక్కులు, చట్టా లు, బాల్యవివాహాల నిర్మూలన అంశాలపై అమెరికాలో పర్యటించడం గొప్ప అనుభూ తినిచ్చిందని పోర్డు సంస్థ సీఈవో లలితమ్మ పేర్కొన్నా రు. పది రోజుల పాటు అమెరికాలో పర్యటించిన ఆమె సోమవారం మీడియాతో మాట్లాడుతూ సీఆర్‌వై అమెరికా అహ్వానంతో తాను, సినీనటుడు వివేక్‌ ఒబెరాయ్‌ అమెరికాలోని ఐదు రాష్ట్రాల్లో పర్యటించామన్నారు. మదనపల్లె, పెద్దమండ్యం మండలాల్లో పోర్డు సంస్థ బాలల హక్కుల కోసం చేస్తున్న ప్రచారాలు, కార్యక్రమాలను పుస్తకరూపంలో ప్రచురించగా వివేక్‌ఒబెరాయ్‌ ఆమెరికాలో ఆవిష్కరించారన్నారు. అమెరికాలోని ఐదు రాష్ట్రాల సదస్సుల్లో బాలల హక్కుల అంశాలపై ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు.


Read more