12 నుంచి అహోబిళంలో యువతకు శిక్షణ

ABN , First Publish Date - 2022-09-09T04:44:02+05:30 IST

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర స్థాయిల్లో ఈ నెల 12 నుంచి 8 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమం నంద్యాల జిల్లా దిగువ అహోబిళం ఆవరణలో యువతీ యువకులకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుందని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ యోగా వైఎల్‌ టీపీ టీచర్‌ బి.ఎ్‌స.నారాయణరెడ్డి తెలిపారు.

12 నుంచి అహోబిళంలో యువతకు శిక్షణ

కలసపాడు, సెప్టెంబరు 8 : ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్ర స్థాయిల్లో ఈ నెల 12 నుంచి 8 రోజుల పాటు జరిగే శిక్షణ కార్యక్రమం నంద్యాల జిల్లా దిగువ అహోబిళం ఆవరణలో యువతీ యువకులకు నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుందని ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ యోగా వైఎల్‌ టీపీ టీచర్‌ బి.ఎ్‌స.నారాయణరెడ్డి తెలిపారు. ఈ శిక్షణ తరగతులకు 18 నుంచి 35 సంవత్సరాల వయస్సు గల యువతీ యువకులు పాల్గొనవచ్చన్నారు. పదో తరగతి ఆపై తరగతుల వారు పాల్గొనవచ్చన్నారు. ఈ శిక్షణలో గ్రామీణాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, నాయకత్వ లక్షణాలపై ఆర్థికాభివృద్ధిలో ఎదుగుదల, ఆరోగ్యచిట్కాలు, యుక్తి, ముక్తి, భుక్తిపై శిక్షణ ఉంటుందన్నారు.  శిక్షణ ముగిసిన అనంతరం స్కిల్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాం కింద సర్టిఫికెట్‌ మంజూరు చేస్తామన్నారు. శిక్షణలో పాల్గొనదలచిన వారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. 11వ తేదీ సాయంత్రం దిగువ అహోబిళం చేరుకోవాలన్నారు. ఇతర వివరాలకు 9441932390 నెంబరును సంప్రదించాలని కోరారు.

Read more