కోదండరామాలయంలో ట్రైనీ కలెక్టర్లు

ABN , First Publish Date - 2022-10-13T04:28:52+05:30 IST

ఏకశిలా నగిరి కోదండరామాలయాన్ని ట్రైనీ కలెక్టర్లు బుధవారం దర్శించుకున్నారు.

కోదండరామాలయంలో ట్రైనీ కలెక్టర్లు
ఒంటిమిట్ట ఆలయ విశిష్టతను తెలియజేస్తున్న టీటీడీ అర్చకులు

ఒంటిమిట్ట/నందలూరు, అక్టోబరు 12 : ఏకశిలా నగిరి కోదండరామాలయాన్ని ట్రైనీ కలెక్టర్లు బుధవారం దర్శించుకున్నారు. అనకాపల్లి ట్రైనింగ్‌ కలెక్టర్‌ దాత్రిరెడ్డి, చిత్తూరు ట్రైనింగ్‌ కలెక్టర్‌ మేఘస్వరూప్‌, కాకినాడ ట్రైనింగ్‌ కలెక్టర్‌ ప్రకాష్‌ జైన్‌, నెల్లూరు ట్రైనీ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి, ఏలూరు ట్రైనీ కలెక్టర్‌ భరత్‌, కడప ట్రైనీ కలెక్టర్‌ మీనా, అనంతపురం ట్రైనీ కలెక్టర్‌ ప్రశాంత్‌కుమార్‌లు స్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగమండపంలో ఆలయ విశిష్టతను, చరిత్రను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు శ్రీనివాసులురెడ్డి, టీటీడీ అర్చకులు వీణారాఘవాచార్యులు, అధికారులు పాల్గొన్నారు.


సౌమ్యనాథస్వామి ఆలయంలో...

నందలూరులోని సౌమ్యనాథస్వామిని ఏడుగురు శిక్షణా కలెక్టర్లు బుధవారం సాయంత్రం దర్శించుకున్నారు. ఎంపీపీ మేడా విజయభాస్కర్‌రెడ్డి, మేడా పద్మజ దంపతులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామి వారిని దర్శింపచేశారు. అనంతరం శాలువాతో ఘనంగా సత్కరించి స్వామి వారి చిత్రపటాలను అందజేశారు. ఈ సందర్భంగా నందలూరుకు చెందిన ట్రైనీ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరి మాట్లాడుతూ ఏపీ దర్శన్‌లో భాగంగా ప్రతి జిల్లాలో పర్యటిస్తున్నామని, ముఖ్యమైన ప్రదేశాలలో భాగంగా గండికోట, సిద్దవటం కోట, ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయం, సౌమ్యనాథస్వామి ఆలయంతో పాటు ముఖ్యమైన కార్యాలయాలను సందర్శించామన్నారు. తనతో పాటు పెద్దేటి దాత్రిరెడ్డి, వై.మేఘస్వరూప్‌, ప్రకా్‌షజైన్‌, అపూర్వ భరత్‌, రాహుల్‌మీనా, సురపాటి ప్రశాంత్‌కుమార్‌లు ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఈఈ వెంకట్రామయ్య, ఒంటిమిట్ట డిప్యూటీ తహసీల్దారు లవన్‌ కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-13T04:28:52+05:30 IST