అధికారుల అలసత్వాన్ని సహించం

ABN , First Publish Date - 2022-03-17T04:36:47+05:30 IST

ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించమని జడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు.

అధికారుల అలసత్వాన్ని సహించం

కాశినాయన మార్చి 16: ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తే సహించమని జడ్పీటీసీ సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. బుధవారం నర్సాపురం వెలుగు కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపణలు గుప్పించారు. సమావేశానికి హాజరైన వైసీపీ మండల కన్వీనర్‌ విశ్వనాధ్‌రెడ్డ్డి కూడా అదేస్థాయిలో రెవెన్యూ అధికారుల తీరును తప్పుబట్టారు.

తహసీల్దారు రవిశంకర్‌ మాట్లాడుతూ రికార్డ్డుపరంగా సక్రమంగా ఉన్న ప్రతి రైతు భూముల సమ స్యలను పరిష్కరిస్తున్నామన్నారు. ఎంపీడీఓ ముజఫర్‌ రహీం, మండ ల ప్రత్యేకాధికారి బ్రహ్మానందరెడ్డ్డి, మండల ఉపాధ్యక్షులు వెంకటసుబ్బయ్య ఆచారి, భాస్కర్‌రెడ్డ్డి ఏఈ సుబ్రహ్మణ్యం పశువైద్యుడు డాక్టర్‌ వెంకటేశ్వర్లు అధికారులు సిబ్బంది జడ్పీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Read more