సీఎం ఇలాకాలో మంత్రి యోగం ఎవరికి..?

ABN , First Publish Date - 2022-04-05T05:30:00+05:30 IST

మంత్రులందరినీ రెండున్నరేళ్లలో మార్చేసి వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రకటించారు. పాలన పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తుండడంతో ఇప్పుడు మంత్రివర్గం ప్రక్షాళనపై జగన్‌ దృష్టిసారించారు. ఈ నెల 11న మంత్రివర్గం మార్పు ఉంటుంద ంటూ వైసీపీలో చర్చ సాగుతోంది.

సీఎం ఇలాకాలో మంత్రి యోగం ఎవరికి..?

ఆశావహుల్లో ఉత్కంఠ

కడప, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): మంత్రులందరినీ రెండున్నరేళ్లలో మార్చేసి వారి స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేసిన రోజు ప్రకటించారు. పాలన పగ్గాలు చేపట్టి మూడేళ్లు కావస్తుండడంతో ఇప్పుడు మంత్రివర్గం ప్రక్షాళనపై జగన్‌ దృష్టిసారించారు. ఈ నెల 11న మంత్రివర్గం మార్పు ఉంటుంద ంటూ వైసీపీలో చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం సొంత ఇలాకాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుంది? ఈసారి జిల్లాకు మంత్రివర్గ కేటాయింపులో స్థానం ఉండదా...? అసలు మంత్రివర్గం మార్పు ఉంటుందా అనే అసక్తికరమైన చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతోంది. తొలివిడత మంత్రివర్గ విస్తరణలో ఉమ్మడి జిల్లా నుంచి కడప ఎమ్మెల్యే అంజాద్‌బాషాకు డిప్యూటీ సీఎం, మైనార్టీ శాఖ దక్కాయి. అయితే వైసీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు డిప్యూటీ సీఎంకు మళ్లీ కొనసాగింపు ఉండకపోవవచ్చని తెలుస్తోంది. ఆయన స్థానంలో మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్‌బాషాకు అవకాశం కల్పిస్తారని ప్రచారం సాగుతోంది.

మంత్రి పదవిపై పలువురి ఆశలు

మంత్రివర్గం మార్పునకు ముహూర్తం దగ్గరపడడంతో ఆశావహులు ఎవరి ప్రయత్నంలో వారు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత వైఎస్సార్‌ కడప జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలే ఉన్నాయి. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల, డిప్యూటీ సీఎం ప్రాతనిధ్యం వహిస్తున్న కడపను మినహాయిస్తే 5 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మంత్రి పదవికోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎం మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే, రవీంద్రనాథరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వయసు రీత్యా తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామరెడ్డి అడుగుతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కూడా మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. ఇలా ఎవరికి వారు మంత్రి పదవిపై ఆశలు పెట్టుకుని ఉన్నారు. మరి సీఎం ఇలాకాలో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో తేలాలంటే మరి కొద్దిరోజులు వేచి ఉండాల్సిందే.

Updated Date - 2022-04-05T05:30:00+05:30 IST