ముగ్గురు దొంగలు అరెస్టు

ABN , First Publish Date - 2022-06-12T05:36:37+05:30 IST

దువ్వూరు మండలం పరిధిలో చోరీలకు పాల్పడిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి ఐదు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

ముగ్గురు దొంగలు అరెస్టు

కడప(క్రైం), జూన్‌ 11: దువ్వూరు మండలం పరిధిలో చోరీలకు పాల్పడిన ముగ్గురు దొంగలను అరెస్టు చేసి వారి నుంచి ఐదు వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు. శనివారం కాన్ఫరెన్స్‌ హాలులో పాత్రికేయులతో మాట్లాడుతూ మైదుకూరు డీఎస్పీ వంశీధర్‌గౌడ్‌, మైదుకూరు రూరల్‌ సీఐ నరేంద్రరెడ్డి సూచనల మేరకు గుడిపాడు వద్ద ఉన్న వీరిని దువ్వూరు ఎస్‌ఐ రాజు అరెస్టు చేసినట్లు తెలిపారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు జూన్‌ 1న స్థానిక హరీష్‌ ట్రేడర్స్‌లో దొంగలించిన డబ్బుగా నిర్ధారించి స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు. అరెస్టైన వారిలో కడప నగరం మృత్యుంజయ కుంటకు చెందిన నరసింహాచారి, కర్నూలు జిల్లా కోవెలకుంట్లకు చెంది ప్రస్తుతం కడప నగరంలో నివసిస్తున్న రాగిరి గోపినాధ్‌, కాగా మరో నిందితుడు మైనర్‌ అని తెలిపారు. నిందితులను అరెస్టు చేసినందుకు మైదుకూరు రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌, దువ్వూరు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, సిబ్బందిని ఎప్పీ రివార్డులతో అభినందించారు.


Read more