రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ముగ్గురికి బంగారు పతకాలు

ABN , First Publish Date - 2022-11-30T23:28:05+05:30 IST

నంద్యాలలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో రైల్వేకోడూరుకు చెందిన క్రీడాకారులు మూడు బంగారు పతకాలు సాధించినట్లు ఎస్‌వీకే స్పోర్ట్స్‌ అకాడమీ కోచ్‌ శివాజీ, బాలికల కోచ్‌ కృష్ణవేణిలు బుధవారం తెలిపారు.

రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో ముగ్గురికి బంగారు పతకాలు
గోల్డ్‌, సిల్వర్‌, బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించిన క్రీడాకారులు

రైల్వేకోడూరు, నవంబరు 30: నంద్యాలలో ఈ నెల 25 నుంచి 27 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీల్లో రైల్వేకోడూరుకు చెందిన క్రీడాకారులు మూడు బంగారు పతకాలు సాధించినట్లు ఎస్‌వీకే స్పోర్ట్స్‌ అకాడమీ కోచ్‌ శివాజీ, బాలికల కోచ్‌ కృష్ణవేణిలు బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పి.మనీషా, పి.శ్రీరాం, ఎం.చైతన్యప్రసాద్‌లు బంగారు పతకాలు, మోక్షశ్రీ, దీక్షిత, టి.శశికుమార్‌, పి.హర్షవర్థన్‌, కె.సన్విత, కె.ధన్వంత్‌లు సిల్వర్‌ మెడల్స్‌ను సాధించారన్నారు. ఎం.మనోజ్‌కుమార్‌, పి.నాగచరణ్‌, విష్ణు, నిఖిల్‌లు బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారని తెలిపారు. గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు.

Updated Date - 2022-11-30T23:28:05+05:30 IST

Read more