‘నీ అంతు చూస్తా’ అంటూ బెదిరింపులు

ABN , First Publish Date - 2022-09-25T05:13:42+05:30 IST

ఆసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ.. నిన్ను చంపేస్తా, నీ అంతు చూస్తా అంటూ మట్కా సుదర్శన్‌ అలియాస్‌ సుదర్శన్‌రెడ్డి (క్రికెట్‌ బుకీ) తనను బెదిరించాడని వైసీపీ కౌన్సిలర్‌ మునీర్‌ టుటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

‘నీ అంతు చూస్తా’ అంటూ బెదిరింపులు

బంగారుమునిరెడ్డి అండ చూసుకునే బెదిరిస్తున్నాడు

సుదర్శన్‌రెడ్డిపై వైసీపీ కౌన్సిలర్‌ మునీర్‌ ఫిర్యాదు

ప్రొద్దుటూరు క్రైం, సెప్టెంబరు 24: ఆసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతూ.. నిన్ను చంపేస్తా, నీ అంతు చూస్తా అంటూ మట్కా సుదర్శన్‌ అలియాస్‌ సుదర్శన్‌రెడ్డి (క్రికెట్‌ బుకీ) తనను బెదిరించాడని వైసీపీ కౌన్సిలర్‌ మునీర్‌ టుటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుదర్శన్‌రెడ్డి ఎమ్మెల్యే బావమరిది బంగారు మునిరెడ్డి అండతోనే బెదిరిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాది మునీర్‌ వివరాల మేరకు... తాను 19 వార్డు వైసీపీ కౌన్సిలర్‌ నని, శనివారం సాయం త్రం తన ఇంటి వద్ద ఉండగా, 9666312783 నెంబరు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చిందన్నారు.

తాను మాట్లాడుతుండగానే, ఫోన్‌ చేసిన సుదర్శన్‌రెడ్డి ఆసభ్యకరమైన పదజాలంతో తిడుతూ నా అక్క గురించి మాట్లాడతావా.. చంపి నీ అంతు చూ స్తానంటూ బెదిరించాడని మునీర్‌ ఆరోపించారు. తాను ఎవరి గురించి ఎక్కడా మాట్లాడలేదన్నాడు. నందం సుబ్బయ్యకు పట్టిన గతే నీకు పడుతుండని బెదిరింపులకు పాల్పడ్డాడని, సదరు సుదర్శన్‌రెడ్డి గతంలో తన స్నేహితుడు దుగ్గిరెడ్డి రఘునాధరెడ్డిని కూడా బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనకు, తన కుటుంబ సభ్యులకు, తోటి కౌన్సిలర్లకు సుదర్శన్‌రెడ్డి ద్వారా ప్రాణహనీ ఉం దని, సుదర్శన్‌రెడ్డి అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని ఆయన టుటౌన్‌ సీఐ ఇబ్రహీంకు ఫిర్యాదు ప్రతిని అందించారు. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఫిర్యాది మునీర్‌ వెంట ఎమ్మెల్సీ రమే్‌షయాదవ్‌ సోదరుడు వెంకటప్రసాద్‌, వైసీపీ కౌన్సిలర్లు వంగనూరు మురళీధర్‌రెడ్డి, వైఎస్‌ మహమ్మద్‌ గౌస్‌, కొత్తపల్లె సర్పంచ్‌ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఉన్నారు.

Read more