-
-
Home » Andhra Pradesh » Kadapa » This is a bad government TDP-MRGS-AndhraPradesh
-
ఇది బాదుడు ప్రభుత్వం : టీడీపీ
ABN , First Publish Date - 2022-09-12T05:07:04+05:30 IST
జగన్ ప్రభుత్వం కరెంటు చార్జీలు, నిత్యావసర ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరిచేస్తోందని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి అన్నారు.

ముద్దనూరు సెప్టెంబరు11:జగన్ ప్రభుత్వం కరెంటు చార్జీలు, నిత్యావసర ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరిచేస్తోందని జమ్మలమడుగు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి భూపే్‌షరెడ్డి అన్నారు. మండల పరిధి మాదన్నగారిపల్లె, కోనాపురం గ్రామాల్లో ఆదివారం బాదుడే బాదుడు కార్యక్రమంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శివరామిరెడ్డి, కేశవరెడ్డి, జగదీశ్వరరెడ్డి, లక్ష్మీనారాయణ, అశోక్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి,సురే్‌షరెడ్డి, రామాంజనేయులరెడ్డి, కొండయ్య, రమే్‌షనాయుడు, రామాంజనేయులు, వెంకటేష్, చిన్నమాబు, పెద్దమాబు, పీరయ్య, దస్తగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా క్షేత్రంలో వైసీపీ ప్రభుత్వం విఫలం
జమ్మలమడుగు రూరల్, సెప్టెంబరు 11: వైసీపీ ప్రభుత్వం ప్రజాక్షేత్రంలో విఫలమైందని జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జి దేవగుడి భూపే్‌షరెడ్డి విమర్శించారు. ఆదివారం మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఇన్‌చార్జి, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున ఇంటింటికీ వెళ్లి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు భారం పెరిగిందన్నారు. అన్నెబోయిన కొండయ్య, కిరణ్‌రాయల్, రఫి, బీఎ్‌సకేమల్లి, పెరుమాళ్ల జయచంద్ర, తిరుమలకొండయ్య, సయ్యద్, ఖదీర్, తదితరులు పాల్గొన్నారు.