చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం సుభిక్షం

ABN , First Publish Date - 2022-11-07T23:49:45+05:30 IST

చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని మదనపల్లె టీడీపీ ఇనచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ పేర్కొన్నారు.

చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం సుభిక్షం
నిమ్మనపల్లెలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌

నిమ్మనపల్లె నవంబరు 7: చంద్రబాబు పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని మదనపల్లె టీడీపీ ఇనచార్జ్‌, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌ పేర్కొన్నారు. సోమవారం ఆయన కుటుంబ సమేతంగా తవళం అటవీ ప్రాంతంలో వెలిసిన నేలమల్లేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర దివాళా తీసిందన్నారు. కనీసం ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబును చూడాలన్నారు. మండల నాయకులు మాట్లాడుతూ తామంతా కలసికట్టుగా పని చేస్తామన్నారు. కార్యక్ర మంలో నేతలు యశశ్విరాజ్‌, చాణిక్యతేజ్‌, లక్ష్మన్న, మునిరత్నం, మల్లప్ప, చెన్నరాయుడు, సూర్యప్రకాశ, భూపతి, విజయ్‌, గోపి, జగనమోహనరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

టీడీపీ బలోపేతానికి కృషి చేయాలి

పెద్దమండ్యం, నవంబరు 7: టీడీపీ బలోపేతానికి టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలని మండల టీడీపీ కన్వీనర్‌ వెంకటరమణ పిలుపు నిచ్చా రు. పెద్దమండ్యంలో సోమవారం మండల టీడీపీ నాయకుల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థుల విజయానికి టీడీపీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెలుగు దేశం పార్టీకి విజయ లక్ష్యంగా పని చేస్తామన్నారు. మండలంలోని పట్టభద్రు ల ఓటరు జాబితా పరిశీలించాలన్నారు. మండల టీడీపీ ప్రధాన కార్య దర్శి కాలేషా, నాయకులు గంగాధర, మహేష్‌, నార శ్రీనివాసులు, రమ ణ, పెద్దన్న, మోహన, మాతయ్య, శేషాద్రి, చలపతి నాయుడు, ఓబు లేసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-07T23:49:45+05:30 IST

Read more