-
-
Home » Andhra Pradesh » Kadapa » The speed of implementation of schemes should be increased-MRGS-AndhraPradesh
-
పథకాల అమలులో వేగం పెంచాలి
ABN , First Publish Date - 2022-08-18T04:52:03+05:30 IST
ప్రభుత్వ పధకాల అమలులో మరిం త వేగం పెంచి ప్రభుత్వ లక్ష్యసాధనకు పాటుపడాలని పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి శారదమ్మ పేర్కొన్నారు.

పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి శారదమ్మ
కడప(రూరల్), ఆగష్టు 17: ప్రభుత్వ పధకాల అమలులో మరిం త వేగం పెంచి ప్రభుత్వ లక్ష్యసాధనకు పాటుపడాలని పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి శారదమ్మ పేర్కొన్నారు. బుధవారం తన కార్యాలయంలో సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ జిల్లాలో పశుపోషణ అభివృద్ధికి పాటుపడాలన్నారు. పశుపోషణతో రైతులకు అధిక ఆదాయం వచ్చేలా చూడాలన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.