అధికార పక్షమే... ప్రతిపక్షమై..!

ABN , First Publish Date - 2022-11-30T23:40:44+05:30 IST

నమ్మి గెలిపించుకున్న ప్రజలకు ఏ మాత్రం సేవ చేయలేని పరిస్థితు లు నెలకొన్నాయి. లక్షలు ఖర్చుచేసి గెలిచినా కనీస గౌరవం కూడా దక్కడం లేదు. మురుగు కాలువ సమస్య కూడా చక్కదిద్దలేకపోతున్నాం. ఇక అభివృద్ది ఏం సాధ్యమవుతుందని అధికార పార్టీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. టీడీపీ కౌన్సిలర్లు వారితో గొంతు కలిపారు. బుధవారం బద్వేలు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

అధికార పక్షమే... ప్రతిపక్షమై..!
ప్రశ్నిస్తున్న వైసీపీ కౌన్సిలర్‌

నమ్మి గెలిపించుకున్న ప్రజలకు ఏ మాత్రం సేవ చేయలేని పరిస్థితు లు నెలకొన్నాయి. లక్షలు ఖర్చుచేసి గెలిచినా కనీస గౌరవం కూడా దక్కడం లేదు. మురుగు కాలువ సమస్య కూడా చక్కదిద్దలేకపోతున్నాం. ఇక అభివృద్ది ఏం సాధ్యమవుతుందని అధికార పార్టీ కౌన్సిలర్లు ధ్వజమెత్తారు. టీడీపీ కౌన్సిలర్లు వారితో గొంతు కలిపారు. బుధవారం బద్వేలు మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశంలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది.

-బద్వేలు

స్థానిక మున్సిపల్‌ కార్యాలయం లోని సమావేశ మందిరంలో మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి అధ్యక్షతన బుధవారం మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందరర్భంగా సమస్యలపై అధికారపక్ష కౌన్సిలర్లు గళం విప్పడం, వారితో ప్రతిపక్ష టీడీపీ కౌన్సిలర్లు కూ డా గొంతు కలపడంతో సమావేశం వాడివేడిగా జరిగింది. సమస్యలను పరిష్కరించడంలో నిర్ల క్ష్యం ఎదురవుతుండడంతో, అబివృద్ధి ఎలా సాధ్యమవుతుందని కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. టీడీ పీ కౌన్సిలర్ల వార్డులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. 13వ వార్డులో ఇళ్లనడుమ మురు గు నిల్వలను ఆర్డీవో పరిశీలించినా ఇంతవరకు పరిష్కారానికి నోచు కోలేదని టీడీపీ కౌన్సిలర్‌ మహమ్మద్‌ హసన్‌ ధ్వజమెత్తారు. మరో కౌన్సిలర్‌ మిత్తికాయల సునీత మాట్లాడుతూ పేదవారికి ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు డ్వాక్రా సంఘాల ద్వారా 35 వేలు రు ణం తీసుకోవాలని, లేకుంటే ఇంటిపట్టాలు తీసేస్తామని బెదిరించడం సరైంది కాదన్నారు. ప్రభు త్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆమె కోరారు. 20వ వార్డు వైసీపీ కౌన్సిలర్‌ వెంకటసుబ్బయ్య మా ట్లాడుతూ తాము రూ.30 లక్షలు ఖర్చు చేసి ఎన్నికల్లో గెలిస్తే కౌన్సిలర్‌ అని కూడా అధి కారులు గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేని దుస్థితిలో అధికారులు ఉన్నారని ఆమె విమర్శించారు. మరో వైసీపీ కౌన్సిలర్‌ చెన్నయ్య మాట్లాడుతూ దళితవాడలపై అధికారులు వివక్ష చూపుతున్నారని తన వార్డు పరిధిలో సిమెంటు రోడ్డు ఏర్పాటుకు మట్టి తోలి నెలలు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో ఆ ప్రాంత ప్రజలు కోర్టు నోటీసు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. 15వ వార్డులో ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని పలుసార్లు సమావేశం దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని ఆ వా ర్డు కౌన్సిలర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. 6వ వార్డులో సిమెంటు రోడ్డు నిర్మించడం లేదని అనేక దఫాలు సమావేశం దృష్టికి తెచ్చినా ఫలితం లేదన్నారు. 1వ వార్డు కౌన్సిలర్‌ రత్న మ్మ మాట్లాడుతూ పట్టణంలో పందుల బెడద తీవ్రంగా ఉందని పలుసార్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చినా పరిష్కరించలేనపుడు స మావేశాలు ఎందుకని ఆమె ధ్వజమెత్తారు. త 16వవార్డు కౌన్సిలర్‌ మణి కూడా కౌన్సిలర్లకు ఎలాంటి గౌరవం ఇవ్వడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 4వవార్డు కౌన్సిలర్‌ రామిరెడ్డి మాట్లాడుతూ వార్డులో కంపచెట్లుతొలగించలేని దుస్థితిలో ఉన్నామంటే సమావేశం ఎందుకు అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దశలవారీగా అభివృద్ధి : కమిషనర్‌

అనంతరం కమిషనర్‌ కృష్ణారెడ్డి సమాధానమిస్తూ అన్నివార్డుల్లో దశలవారీగా సిమెంటురోడ్లు వేస్తామని, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. పందులను నివారించేందుకు పోలీసు అధికారుల సహకారం ఉండాలని, త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ ఏ వార్డులో ఎలాంటి అభివృద్ది పనులు చేపట్టినా మొదట కౌన్సిలర్లకు తెలపాలని, అలా తెలుపకుండా ఏవైనా పనులు చేపడితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. ప్రతి కౌన్సిలర్‌కు గౌరవం ఇవ్వాలని, వారు ఏవైనా సమస్యలను అధికారుల దృష్టికి తెస్తే తక్షణమే పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T23:40:49+05:30 IST