ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దేరు

ABN , First Publish Date - 2022-12-13T00:00:36+05:30 IST

ములకలచెరువు మండలంలో మాండస్‌ తుఫాను కారణంగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది.

ఉధృతంగా ప్రవహిస్తున్న పెద్దేరు
ప్రవహిస్తున్న పెద్దేరు

ములకలచెరువు, డిసెంబరు 12: ములకలచెరువు మండలంలో మాండస్‌ తుఫాను కారణంగా ఏకధాటిగా వర్షం కురుస్తోంది. ఆదివారం ఒక్కరోజు కాస్త ఆగిన వర్షం సోమవారం మళ్లీ భారీగా కురుస్తోంది. రోజంతా వర్షం వదలకుండా కురుస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షంతో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అలాగే ప్రధాన రహదారులు, గ్రామీణ రోడ్లు వర్షపు నీటితో ప్రవహించాయి. ములకలచెరువు మండలం మీదుగా వెళుతున్న పెద్దేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. చౌడసముద్రం సమీపంలో పెద్దేరు ధాటికి ములకలచెరువు-తంబళ్లపల్లె మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రాకపోకలు సాగించకుండా రోడ్డుకిరువైపులా గ్రామస్థులు కంపచెట్లను అడ్డంగా వేశారు. బస్టాండు సమీపంలోని బంగ్లా ఎదురుగా వర్షపు నీరు భారీగా ప్రవహించడంతో ముంబాయి-చెన్నై జాతీయ రహదారిలో వాహనదారులు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Updated Date - 2022-12-13T00:00:36+05:30 IST

Read more