క్వారీలను వడ్డెరలకే కేటాయించాలి

ABN , First Publish Date - 2022-10-12T04:43:38+05:30 IST

కంకర మిషన్లు, క్వారీలను వడ్డెరలకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ వడ్డెర విద్యావంతుల వేదిక అన్నమయ్య జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.

క్వారీలను వడ్డెరలకే కేటాయించాలి

రాయచోటి (కలెక్టరేట్‌), అక్టోబరు11 :  కంకర మిషన్లు,  క్వారీలను వడ్డెరలకే కేటాయించాలని ఆంధ్రప్రదేశ వడ్డెర విద్యావంతుల వేదిక అన్నమయ్య జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది.  మంగళ వారం వేదిక స్థానిక కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా రాష్ట్ర కోకన్వీనర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో సుమారుగా 60 వరకు కంకర మిషన్లు, వందల సంఖ్యలో క్వారీలు ఉండగా వాటన్నింటినీ ఉన్నత వర్గాలు దక్కించుకొని వడ్డెరలను కూలీలుగా మార్చివేశా యని ఆవేదన వ్యక్తం చేశారు. 

Read more