-
-
Home » Andhra Pradesh » Kadapa » The process of merging schools should be stopped immediately-MRGS-AndhraPradesh
-
పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలి
ABN , First Publish Date - 2022-03-17T04:50:16+05:30 IST
పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారు.

నందలూరు, మార్చి 16 : పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ ఆధ్వర్యంలో మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా మండలంలోని పలు పాఠశాలలను టీఎన్‌ఎ్‌సఎ్‌ఫ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్ మాట్లాడుతూ అసంబద్ధంగా కొనసాగిస్తున్న పాఠశాలల విలీన ప్రక్రియను తక్షణమే నిలిపివేయకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.