వీఆర్వోల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

ABN , First Publish Date - 2022-12-13T00:04:24+05:30 IST

గ్రామరెవెన్యూ అధికారుల సమస్య లను వెంటనే పరిష్కరించాలని సం ఘం నాయకులు సోమవారం పీటీ ఎం తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు.

 వీఆర్వోల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందిస్తున్న వీఆర్వోలు

పెద్దతిప్పసముద్రం డిసెంబర్‌ 12 : గ్రామరెవెన్యూ అధికారుల సమస్య లను వెంటనే పరిష్కరించాలని సం ఘం నాయకులు సోమవారం పీటీ ఎం తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈసందర్బంగా పలు వురు వీఆర్వోలు మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా చనిపోయిన గ్రామ రెవెన్యూ అధికారుల కుటుం బ సభ్యులకు వెంటనే రూ.25 లక్షలు ఆర్థిక సహాయం చేసి కారుణ్య నియా మకం ద్వారా కుటుంబంలో ఒక్కరికి 658 జీవో ప్రకారం వెంటనే ఉద్యోగం ఇవ్వా లన్నారు. ఇప్పటి వరకు మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదని, వెంటనే చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని, గ్రామ రెవెన్యూ అధికారులకు పని ఒత్తిడిని తగ్గించాలని, రీసర్వే పేరుతో వీఆర్వోలతో పెట్టించిన ఖర్చులను వెంటనే చెల్లించాల న్నా రు. గ్రేడ్‌ 2 వీఆర్వోలను గ్రేడ్‌1గా మార్చాలని, ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను భర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు శ్రీరా ములు, సలీంబాష, మల్లిఖార్జున, గంగాద్రి, లలితకుమారి, సుబ్బారావ్‌, వరదరాజులు, మూర్తి, చిన్నపరెడ్డి, నరసింహులు, చిన్నప్ప పాల్గొన్నారు.

బి.కొత్తకోటలో: వీఆర్వోలకు పని ఒత్తిడిని తగ్గించాలని ప్రభుత్వాన్ని కోరుతూ మండలంలోని వీఆర్వోలు సోమవారం తహసీల్దార్‌ ధనంజ యులుకు వినతి పత్రాన్ని అందచే శారు. రీసర్వేలు, రెవెన్యూ పనులతో పాటు ఇతర పనులను వీఆర్వోలకు అప్పగించడం వలనపని ఒత్తిడి అధికమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమ యం ఉదయం 10గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మాత్రమే వీఆర్వో లు విధులు నిర్వహించేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. పని ఒత్తిడి కారణంగా చనిపోయిన వీఆర్వోల కుటుంబాలకు రూ. 25 లక్షలు ఆర్థిక సహాయంతో పాటు, వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా వెంటనే ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వీఆర్వోలు అహమ్మద్‌, రామకృష్ణ, వెంకటేష్‌, వెంకటరమణ, నరసింహులు, హైదర్‌, ఖాదర్‌బాష, సంధ్య పాల్గొన్నారు.

Updated Date - 2022-12-13T00:04:26+05:30 IST