-
-
Home » Andhra Pradesh » Kadapa » The movement does not stop until the fitment is increased-MRGS-AndhraPradesh
-
ఫిట్‌మెంట్ పెంచే వరకు ఉద్యమం ఆగదు
ABN , First Publish Date - 2022-02-20T04:53:32+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేసిన 11వ వేతన సవరణలో ఫిట్‌మెం ట్‌ను పెంచేవరకు ఉద్యమం ఆగదని ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాదన విజయకుమార్ హెచ్చరించారు.

బద్వేలు, ఫిబ్రవరి 19: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు అమలు చేసిన 11వ వేతన సవరణలో ఫిట్‌మెం ట్‌ను పెంచేవరకు ఉద్యమం ఆగదని ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మాదన విజయకుమార్ హెచ్చరించారు. పీఆర్‌సీ అమలులో ఉద్యోగ, ఉపాధ్యాయులకు జరిగిన అన్యాయన్ని నిరసిస్తూ జస్టిస్ ఫర్ పీఆర్‌సీ రాష్ట్ర సమితి పిలుపుమేరకు ముఖ్యమంత్రికి ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి వినతి పత్రాలను పంపే కార్యక్రమంలో భాగంగా బద్వేలు మండల పరిదిలోని వివిధ పాఠశాలల్లో సంతకాల కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన 11వ వేతన సవరణ ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయ తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఉద్యోగుల అసంతృప్తిని ప్రభుత్వం ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా కొంతమంది నాయకుల ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చిందని ఆరోపించారు.
కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి గురుప్రసాద్, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యుడు ఎస్.శశిధర్‌కుమార్, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శివప్రసాద్, డీవీ శ్రీనివాసులరెడ్డి, ఎం.గురవయ్య, ప్రధానోపాధ్యాయుల సంఘం నాయకులు ఏవీ రమణయ్య, సుబ్రహ్మణ్యం, గంగయ్య, సుబ్బారావు, పెంచలయ్య, వరలక్ష్మి, గౌస్‌బాష, సురేష్, రవికుమార్, స్వాతి, తదితరులు పాల్గొన్నారు.