వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2022-04-06T05:14:23+05:30 IST

ఒంటిమిట్టలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.

వ్యక్తి దారుణ హత్య
హత్య జరిగిన వ్యక్తి మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

ఒంటిమిట్ట, ఏప్రిల్‌ 5: ఒంటిమిట్టలో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. జాతీ య రహదారి అనుకుని ఉన్న శివాలయం వద్ద గత కొద్ది రోజులుగా అనంతపురం జిల్లా పామిడి వాసి రవి సిమెంటు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఆలయం వద్ద నిద్రిస్తుండేవాడు. అతనితో పాటు మరో ఇరువురు స్నేహితులు పులివెందులకు చెందిన దస్తగిరి, సిద్దవటంకు చెందిన చంద్ర కలిసి పనులు చేసుకుంటూ అక్కడే ఉండేవారు. సోమవారం మధ్యం తాగి మత్తులో నిద్రిస్తున్న రవిని తెల్లవారుజామున బండరాయితో పులివెందులకు చెందిన దస్తగిరి బలంగా తలమీద బాదడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే దాడి చేసిన వ్యక్తి పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించి, కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సంజీవరాయుడు తెలిపారు.


 

Read more