పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాల్సిందే

ABN , First Publish Date - 2022-07-04T05:28:39+05:30 IST

వైసీపీ ప్రభుత్వం పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాల్సిందేనని, లేకుంటే ఉద్యమం తప్పదని కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇనచార్జ్‌ వీఎ్‌స.అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.గోవర్థనరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, బి.హరిప్రసాద్‌, కడప నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, తెలుగు రైతు నాయకుడు జి.లక్ష్మిరెడ్డి హెచ్చరించారు.

పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాల్సిందే
ఆర్టీసీ చార్జీల పెంపుపై కడపలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న టీడీపీ నేతలు

టీడీపీ నేతల ధ్వజం

కడప(ఎర్రముక్కపల్లి), జూలై 3 : వైసీపీ ప్రభుత్వం పెంచిన చార్జీలను ఉపసంహరించుకోవాల్సిందేనని, లేకుంటే ఉద్యమం తప్పదని కడప నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇనచార్జ్‌ వీఎ్‌స.అమీర్‌బాబు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌.గోవర్థనరెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, బి.హరిప్రసాద్‌, కడప నగర అధ్యక్షుడు సానపురెడ్డి శివకొండారెడ్డి, తెలుగు రైతు నాయకుడు జి.లక్ష్మిరెడ్డి హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం పెంచిన (కరెంట్‌) చార్జీలు, ఇతర పన్నులు మీద బాదుడే.. బాదుడు కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా ప్రధాన కార్యదర్శి వికా్‌సహరిఆధ్వర్యంలో 45, 46 డివిజన్లలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు కరపత్రం ఇచ్చి ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన ప్రభు త్వం పెంచిన చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశా రు. రాష్ట్ర ప్రజలపైన పన్నుల రూంలో అనేక రకాలుగా ఆర్థిక భారం  వేసి దోచుకునే కార్యక్రమాలను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జి.విశ్వనాథ్‌రెడ్డి, మాజీ ప్లోర్‌ లీడర్‌, నగర ప్రధాన కార్యదర్శి జలతోటి జయకుమార్‌, ఆమూరి బాలదాసు, కొమ్మలపాటి సుబ్బరాయుడు, రాంప్రసాద్‌, జియా ఉద్దీన, మాసాపేట శివ, మాసా కొండ రామ్‌, నబీకోట శ్రీనివాసులు, కొండా సుబ్బయ్య, సానపురెడ్డి రవిశంకర్‌రెడ్డి, లాయర్లు గడ్డం గుర్రప్ప, శివశంకర్‌రెడ్డి, సుధాకర్‌ యాదవ్‌, జనార్థనరెడ్డి, ఓబుల్‌రెడ్డి, షేక్‌ ఇమ్రాన, అనిల్‌కుమార్‌, ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read more