మద్యం దుకాణం మూసేంత వరకు పోరు ఆపం!

ABN , First Publish Date - 2022-07-06T05:06:54+05:30 IST

మద్యం దుకాణం కారణంగా రోజూ గొడవలు జరుగుతున్నాయంటూ ధర్నా చేసి ఐదు రోజుల వుతున్నా పట్టించుకోలేదు.

మద్యం దుకాణం మూసేంత వరకు పోరు ఆపం!

పీలేరు, జూలై 5: మద్యం దుకాణం కారణంగా రోజూ గొడవలు జరుగుతున్నాయంటూ ధర్నా చేసి ఐదు రోజుల వుతున్నా పట్టించుకోలేదు. అందుకే  షాపు మూసేంత వ రకు ఈ సారి ఎవరు చెప్పినా వినేది లేదు.. అంటూ పీలేరులోని కావలిపల్లె ప్రాంత మహిళలు మంగళవారం మద్యం దుకాణం ముందు భీష్మించుకు కూర్చున్నారు. .  ఐదు రోజులు గడుస్తున్నా అధికారుల్లో ఎటువంటి చలనం లేకపోవడంతో మంగళవారం మరోమారు ధర్నాకు పూనుకున్నారు. ఈసారి షాపును తరలించేంత వరకు విశ్రమించబోమని, అవసరమైతే షాపు ముందు టెంటు ఏర్పాటు చేసుకుని రిలే నిరాహార దీక్ష చేస్తామని హెచ్చరించారు. 

Read more