జిల్లాల ప్రకటన అంతా రాజకీయ డ్రామా

ABN , First Publish Date - 2022-01-29T05:03:28+05:30 IST

చుట్టుముట్టిన రాజకీయ, ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్‌ సర్కార్‌ 26 జిల్లాల ప్రకటనతో రాజకీయ డ్రామా ఆడుతోందని టీడీపీ కడప పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌పీ మహబూబ్‌ హుస్సేన్‌ అన్నారు.

జిల్లాల ప్రకటన అంతా రాజకీయ డ్రామా

 టీడీపీ కడప పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌పీ మహబూబ్‌ హుస్సేన్‌

ప్రొద్దుటూరు క్రైం, జనవరి 28 : చుట్టుముట్టిన రాజకీయ, ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే జగన్‌ సర్కార్‌ 26 జిల్లాల ప్రకటనతో రాజకీయ డ్రామా ఆడుతోందని టీడీపీ కడప పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్‌పీ మహబూబ్‌ హుస్సేన్‌ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఉద్యోగుల ఉద్యమం, రాష్ట్రంలో ప్రబలిన కొవిడ్‌ కేసుల కట్టడిలో వైఫల్యం, సినిమా టికెట్లు గోల, క్యాసినో రగడ, పెరిగిన నిత్యావసరాల ధరలు ఇవన్నీ వైసీపీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలు కూడా జగన్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. వీటంన్నింటిపై నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే 26 జిల్లాల ప్రకటనకు తెరలేపారన్నారు.  

Read more