జిల్లా కేంద్రం చేయాల్సిందే..

ABN , First Publish Date - 2022-02-16T05:50:12+05:30 IST

రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌ ఈ ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి సంతకాల సేకరణ చేశారు. అద్దేపల్లె ప్రతా్‌పరాజు, మహేష్‌, పూలభాస్కర్‌, అబుబకర్‌, పీరుసాహెబ్‌ తదితరులతో లక్ష సంతకాల సేకరణలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభాకర్‌ నాయుడు, కొండూరు శరత్‌కుమార్‌రాజు, వెంకటయ్య, రెడ్డయ్య తదితరులు కలిసి మంగళవారం ఉదయమే రాజంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో మహిళలు, చిన్నారులు, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి మోకాళ్లపై నడుస్తూ రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌ చేశారు.

జిల్లా కేంద్రం చేయాల్సిందే..
రాజంపేటలో సంతకాల సేకరణ చేస్తున్న జేఏసీ నాయకులు

రాజంపేట కోసం మోకాళ్లపై నడుస్తూ నిరసన

జేఏసీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ 

పోస్టు కార్డుల ఉద్యమం

సీఎంకు విన్నవించడానికి విజయవాడ వెళ్లిన ప్రజాప్రతినిధులు

రాజంపేట, ఫిబ్రవరి 15: రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలనే డిమాండ్‌ ఈ ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతోంది. మంగళవారం జేఏసీ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలతో కలిసి సంతకాల సేకరణ చేశారు. అద్దేపల్లె ప్రతా్‌పరాజు, మహేష్‌, పూలభాస్కర్‌, అబుబకర్‌, పీరుసాహెబ్‌ తదితరులతో లక్ష సంతకాల సేకరణలో భాగంగా సంతకాల సేకరణ చేపట్టారు. ప్రభాకర్‌ నాయుడు, కొండూరు శరత్‌కుమార్‌రాజు, వెంకటయ్య,  రెడ్డయ్య తదితరులు కలిసి మంగళవారం ఉదయమే రాజంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడామైదానంలో మహిళలు, చిన్నారులు, వాకర్స్‌ అసోసియేషన్‌ సభ్యులతో కలిసి మోకాళ్లపై నడుస్తూ రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలని డిమాండ్‌ చేశారు. నరసింహ, ఇడిమడకల కుమార్‌, ఎం.ఎ్‌స.రాయుడు, సుబ్రహ్మణ్యంనాయుడు తదితరులు పోస్టుకార్డులు రాసి సీఎం కార్యాలయానికి పంపారు. కాగా.. రాజంపేట, రైల్వేకోడూరు ప్రజల మనోభావాలను తెలియజేయడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో బుధవారం రాజంపేట ప్రజాప్రతినిధులు భేటీ కానున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేలు మేడా మల్లికార్జునరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విజయవాడకు వెళ్లారు.

మేడా ఇంటికి ఉద్యమ సెగ..?

రాజంపేట జిల్లా సాధన కోసం నియోజకవర్గంలో సాగుతున్న ఉద్యమ సెగ ఎమ్మెల్యే మేడా మల్లికార్జురెడ్డి ఇంటిని తాకింది. బోయనపల్లె వద్ద అన్నమయ్య విగ్రహానికి సమీపంలో ఉన్న ఎమ్మెల్యే మేడా నివాస గృహం వద్ద మంగళవారం రాత్రి సుమారు 8గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ట్రాక్టర్‌లో వచ్చి గేటును ఢీకొట్టారు. ట్రాక్టర్‌లో తీసుకొచ్చిన టైర్లు, గడ్డి, కంప, కట్టెలు గేటు ముందు వేసి కాల్చడానికి ప్రయత్నించారు. అక్కడి వాచ్‌మాన్‌లు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి, మన్నూరు సీఐ పుల్లయ్య ఎస్‌ఐ భక్తవత్సలం సంఘటన స్థలానికి చేరుకున్నారు. గేటుకు అడ్డంగా వేసిన టైర్లను, కంపను, కట్టెలను గడ్డిని తీసివేశారు. సంఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే గానీ, వారి అనుచరులు గానీ లేరు. దీనిపై ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని ఫోన్‌లో వివరణ కోరగా ఇది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. రాజీనామాల వల్ల సమస్యలు పరిష్కారం కావన్నారు. ముఖ్యమంత్రితో జిల్లా గురించి చర్చించడానికి తాను ప్రస్తుతం విజయవాడలో ఉన్నానన్నారు. ఆయన న్యాయం చేస్తారని నమ్మకం తమకుందన్నారు.

Updated Date - 2022-02-16T05:50:12+05:30 IST