-
-
Home » Andhra Pradesh » Kadapa » The distribution of rice should not be neglected-MRGS-AndhraPradesh
-
బియ్యం పంపిణీలో నిర్లక్ష్యం తగదు
ABN , First Publish Date - 2022-07-19T05:03:31+05:30 IST
చెన్నూరు మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

బీజేపీ నేతల నిరసన
చెన్నూరు, జూలై 18 : చెన్నూరు మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాదినేని రామసుబ్బయ్య మాట్లాడుతూ ప్రతి నెలా కేంద్ర ప్రభుత్వం పేదలకు ఒక్కొక్కరికి 5 కేజీల వంతున ఇవ్వాలంటూ కరోనా సమయం నుంచి అందిస్తోందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ధోరణిని అవలంభిస్తూ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తమవని చెప్పుకుంటూ లబ్ధిపొందుతోందని, ఇంక అలా కుదరదని ఆయన పేర్కొన్నారు. కేంద్రం నుంచి వచ్చే ఏ పథకమైనా సక్రమంగా అదివ్వడంతో పాటు ఈ పథకం కేంద్ర ఇచ్చినదే అని ప్రజలకు తెలపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకొని ఎప్పటిలాగే ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వ బియ్యంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యాన్ని కూడా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షుడు రెడ్డిప్రసాద్, మహిళా అధ్యక్షురాలు సరోజనమ్మ, నేతలు అతికారి రవికుమార్, రమే్‌షరెడ్డి, కృష్ణకాంత, మునిసుబ్బారెడ్డి, శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.