-
-
Home » Andhra Pradesh » Kadapa » The days for liberation from the anarchic regime are drawing near-MRGS-AndhraPradesh
-
అరాచక పాలన విముక్తికి రోజులు దగ్గరపడ్డాయి
ABN , First Publish Date - 2022-09-09T05:04:15+05:30 IST
వైసీ పీ అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగే రోజులు దగ్గరలో ఉన్నా యని తంబళ్లపల్లె నియోజకవర్గ తెలు గుదేశం పార్టీ ఇన్‌చార్జ్ శంకర్‌యాదవ్ పేర్కొన్నారు.

పెద్దతిప్పసముద్రం సెప్టెంబర్ 8: వైసీ పీ అరాచక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగే రోజులు దగ్గరలో ఉన్నా యని తంబళ్లపల్లె నియోజకవర్గ తెలు గుదేశం పార్టీ ఇన్‌చార్జ్ శంకర్‌యాదవ్ పేర్కొన్నారు. గురువారం మండలంలో ని పులికల్లులో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్ర మాన్ని చేపట్టారు. పెరిగిన పెట్రోల్, డీజల్ ధరలు, విద్యుత్, ఆర్టీసీ చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు గురించి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలకు కలిగిన ప్రయో జనం ఏమిలేదన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. కార్యక్రమంలో ములకలచెరువు ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనాథ్‌రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, తమక శ్రీనివాసులు, శివా నంద, కట్టా సురేంద్రనాయుడు, మనోజ్‌జయంత్ రెడ్డి, మద్దయ్యగారిపల్లె హరిప్రసాద్, పీటీఎం గ్రామ అధ్యక్షుడు ఆదినారాయణ, తెలుగు యువత నాయకుడు చింతకాయల వినోద్, సాయి, బి.కొత్తకోట మాజీ ఎంపీటీసీ మస్తాన్,లతో పాటు తంబళ్లపల్లె నియో జక వర్గంలోని న్ని మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.