-
-
Home » Andhra Pradesh » Kadapa » The brandy shop should be removed-MRGS-AndhraPradesh
-
బ్రాందీ షాపు తొలగించాలి
ABN , First Publish Date - 2022-07-19T05:06:14+05:30 IST
తమ ప్రాంతంలోని బ్రాందీ షాపు మూసివేయా లంటూ పీలేరులోని రాజీవ్‌నగర్ కాలనీ వాసులు, విద్యార్థులు ప్రజా సంఘాలు సోమవారం ఆందోళన చేపట్టారు. పాఠశాల, ఇళ్ల మధ్యలో ఉ న్న బ్రాందీ షాపు వల్ల తాము ప్రతిరోజూ అనేక ఇబ్బందులు పడుతున్నా మని పలువురు మహిళలు వాపోయారు.

మహిళలు, ప్రజాసంఘాల ఆందోళన
పీలేరు, జూలై 18: తమ ప్రాంతంలోని బ్రాందీ షాపు మూసివేయా లంటూ పీలేరులోని రాజీవ్‌నగర్ కాలనీ వాసులు, విద్యార్థులు ప్రజా సంఘాలు సోమవారం ఆందోళన చేపట్టారు. పాఠశాల, ఇళ్ల మధ్యలో ఉ న్న బ్రాందీ షాపు వల్ల తాము ప్రతిరోజూ అనేక ఇబ్బందులు పడుతున్నా మని పలువురు మహిళలు వాపోయారు. సాయంత్రం పూట మందుబా బుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయని, వారిని అడ్డుకున్న వారిపై అసభ్య పదజాలంతో ధూషించడమే కాక దాడులకు పాల్పడుతున్నారని వారు తె లిపారు. తమకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బ్రాందీ షాపును తక్షణమే తొలగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో సీపీఐ నేతలు వెంకటేశ్, రాజమ్మ, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.