బీసీ హెచడబ్ల్యుఓ అసోసియేషన ఎన్నిక ఏక గ్రీవం

ABN , First Publish Date - 2022-05-19T05:17:30+05:30 IST

జిల్లా పునర్విభజనలో భాగంగా కడప జిల్లా బీసీ వసతి గృహ అధికారుల సంక్షేమ సంఘం ఏక గ్రీవంగా ఎన్నికైంది.

బీసీ హెచడబ్ల్యుఓ అసోసియేషన ఎన్నిక ఏక గ్రీవం

కడప నాగరాజుపేట, మే 18: జిల్లా పునర్విభజనలో భాగంగా కడప జిల్లా బీసీ వసతి గృహ అధికారుల సంక్షేమ సంఘం ఏకగ్రీవంగా ఎన్నికైంది. జిల్లా గౌరవాధ్యక్షుడిగా డి. భాస్కర్‌రెడ్డి, అధ్యక్షుడిగా ఉక్కా రామలింగేశ్వర రెడ్డి ఎన్నికయ్యారు. ప్రకాష్‌ నగర్‌లో ఉన్న బీసీ వసతి గృహంలో బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు మనోహర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో నూతన కమిటీని ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యదర్శిగా జి. శ్రీనివాసులు, కోశాధికారిగా రఘురామరాజు, అసోసియేట్‌ అధ్యక్షుడిగా వెంకటరెడ్డి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా రమణారెడ్డి, మహిళా ప్రతినిధిగా క్రిష్ణవేణి, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Read more