జాతర విషయమై వేంపల్లెలో ఉద్రిక్తత

ABN , First Publish Date - 2022-06-08T05:09:16+05:30 IST

మండలంలోన వేంపల్లెలోగల కనుమలో గంగమ్మ జాతర విషయంగా పల్లెలోని ఇరువర్గాలు మంగళవారం గుమి కూడడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.

జాతర విషయమై వేంపల్లెలో ఉద్రిక్తత
ఇరువర్గాల వారితో చర్చిస్తున్న పోలీసులు

పోలీసుల జోక్యంతో సద్దుమనిగిన వివాదం యథావిధిగా అమ్మవారికి దీలు, బోనాలు సమర్పణ

మదనపల్లె అర్బన్‌, జూన్‌ 7:  మండలంలోన వేంపల్లెలోగల కనుమలో గంగమ్మ జాతర విషయంగా పల్లెలోని ఇరువర్గాలు మంగళవారం గుమి కూడడంతో అక్కడ  ఉద్రిక్తత నెలకొంది. ప్రతి ఏడాది మదనపల్లె కోర్టు లో గంగమ్మ జాతర జరుగుతున్నప్పుడే వేంపల్లెలో కనుమలో గంగమ్మ ఆలయంలో జాతరను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్థులు చెబుతున్నారు. కానీ మేనెల 31న కొంతమంది అమ్మవారిజాతర నిర్వహించారు. మరి కొంతమందికి ఇంట్లో వసతిలేని కారణంగా జాతర చేయకుండా నిలపివేశారు. నిలిపివేసిన వారు జాతరను ఈ నెల 7, 8 తేదీల్లో నిర్వహిస్తామనడంతో వేంపల్లెలో వివాదం రేగింది.  దీంతో ఒక్కరివర్గంపై మరో వర్గం మాటల యుద్ధంతో తోపులాట వరకు వెళ్లింది. మదనపల్లె రూరల్‌ పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదులు అందడంతో  సీఐ సత్యనారాణ, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ వారి సిబ్బందితో అక్కడికి చేరుకుని ఇరువర్గాలను పిలిపించి సర్దుబాటు చేయడంతో వివాదం సద్దుమనిగింది. అనంతరం యథావిధిగా జాతర కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమ య్యారు. మధ్యాహ్నం మహిళలు మంగళవాయిద్యాలతో దీలు, బోనాలు ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సమర్పించారు. రాత్రిజాతరలో  ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించామని సీఐ సత్యనారాయణ తెలిపారు. ఇరువర్గాలు సమ్మతితో అమ్మవారి జాతర జరుపుకోవాలని, గ్రామంలో శాంతియుతంగా ప్రజలు ఉండాలని పోలీసులు సూచించారు.  

భక్తిశ్రద్ధలతో రౌద్రాలమ్మ అంకాళమ్మ జాతర 


పీలేరు టౌన్‌, జూన్‌ 7: పీలేరు గ్రామ దేవత అయిన  రౌద్రాలమ్మ అంకాళ మ్మ జాతర మంగళవారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. ఐదు వారాల జాతరలో భాగంగా మంగళవారం నాలుగో వారం కావడంతో స్థానికులు పెద్దఎత్తున అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. జాతర సందర్భంగా మంగళవారం ఉదయాత్పూర్వమే అమ్మవారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. ఈసందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఈవో రవీంద్రరాజు, ఆలయ కమిటీ చైర్మన్‌ భాస్కరరెడ్డి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా రౌద్రాలమ్మను గుర్రంకొండ మండలంలోని చెర్లోపల్లె రెడ్డమ్మ కొండ ఆలయ కమిటీ చైర్మన్‌ నరసింహారెడ్డి దర్శించుకున్నారు.  కార్యక్రమంలో ఆలయ పూజారులు ప్రసన్నస్వామి, నాగయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. Read more