టీడీపీ విజయమే లక్ష్యం : విజయమ్మ

ABN , First Publish Date - 2022-09-20T05:05:02+05:30 IST

టీడీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పేర్కొన్నారు.

టీడీపీ విజయమే లక్ష్యం : విజయమ్మ
మాట్లాడుతున్న విజయమ్మ

గోపవరం, సెప్టెంబరు 19 : టీడీపీ విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బద్వేలు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని నీరుద్రపల్లెలో మండల టీడీపీ అధ్యక్షుడు మామిడి సుధాకర్‌రెడ్డి స్వగృహంలో మండల స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి ఈ వారంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం బాదుడే బాదుడు కార్యక్రమానికి కార్యకర్తలంతా సిద్దంగా ఉండాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు కలువాయి జయరామిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు రామ్మోహన్‌రెడ్డి, కాలువపల్లె సర్పంచ్‌ పసుపులేటి శ్రీనివాసులు, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి లకిడి వినయ్‌కుమార్‌, మాజీ సర్పంచ్‌ బాలచెన్నయ్య, అల్లం యల్లారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి, వీరారెడ్డి, పసుపులేటి రమణయ్య, రామసుబ్బారెడ్డి, కొండయ్య, మాజీ జడ్పీటీసీ వేముల రమణయ్య, రామచంద్రారెడ్డి, రత్తయ్య, వన్నూరయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read more