వైవీయూ క్రీడాకారులకు ప్రతిభ పురస్కారాలు

ABN , First Publish Date - 2022-06-07T05:42:55+05:30 IST

అఖిలభారత విశ్వవిద్యాలయాల క్రీడా పోటీ ల్లో విజేతలుగా నిలిచిన వైవీయూ క్రీడాకారులకు వేమన క్రీడా పురస్కారాలను సోమవారం వీసీ సూర్యకళావతి అందజేశా రు.

వైవీయూ క్రీడాకారులకు ప్రతిభ పురస్కారాలు
క్రీడాకారులకు ప్రతిభ పురస్కారం అందజేస్తున్న వీసీ సూర్యకళావతి

కడప వైవీయూ, జూన్‌ 6: అఖిలభారత విశ్వవిద్యాలయాల క్రీడా పోటీ ల్లో విజేతలుగా నిలిచిన వైవీయూ క్రీడాకారులకు వేమన క్రీడా పురస్కారాలను సోమవారం వీసీ సూర్యకళావతి అందజేశా రు. రాజస్థాన్‌లోని విద్యాపీఠం విశ్వవిద్యాలయంలో జరిగిన పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో కృపారావు కాంస్యపతకం సాధించారు. ఛండీఘర్‌ యూనివర్శిటీలో జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో శివరామకృష్ణయాదవ్‌ రజిత పతకం సాధించారు. వీరికి వీసీ సూర్యకళావతి, క్రీడా బోర్డు సెక్రటరీ డాక్టర్‌ రామసుబ్బారెడ్డి చేతుల మీదుగా  ఒక్కొక్కరికి రూ.30 వేలు చెక్కును ఇచ్చి శాలువాతో సత్కరించారు. భవిష్యత్తులో జరిగే మరిన్ని క్రీడా పోటీల్లో బహుమతులను గెలువాలని వీసీ ఆకాంక్షించారు. విజేతలను రిజిస్ట్రార్‌ విజయరాఘవప్రసాద్‌, ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి, సిబ్బంది, అధ్యాపకులు, క్రీడాకారులు అభినందించారు. 

 

Read more