హెల్త్‌మేళా సేవలను సద్వినియోగం చేసుకోండి

ABN , First Publish Date - 2022-12-12T23:51:34+05:30 IST

షుగర్‌ వ్యాధిగ్రస్థులకు హెల్త్‌మేళా ద్వారా స్పెషలిస్టు వైద్యులతో టెలికాన్ఫరెన్స్‌లో చికిత్స అందిస్తామని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ పేర్కొన్నారు.

హెల్త్‌మేళా సేవలను సద్వినియోగం చేసుకోండి

డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 12 : షుగర్‌ వ్యాధిగ్రస్థులకు హెల్త్‌మేళా ద్వారా స్పెషలిస్టు వైద్యులతో టెలికాన్ఫరెన్స్‌లో చికిత్స అందిస్తామని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ శాంతికళ పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక శ్రీనివాసనగర్‌లోని ఆర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లో నిర్వహిస్తున్న హెల్త్‌ మేళాను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్‌ దినేష్‌, హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటేశ్వర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్‌ నాగజ్యోతి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-12T23:51:52+05:30 IST

Read more