ఎర్రమట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2022-01-29T05:01:47+05:30 IST

ఎర్రమట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులుకు శుక్రవారం మూడు గ్రామాలకు చెందిన ప్రజలు వినతి పత్రం అందజేశారు.

ఎర్రమట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోండి

ఆర్డీవోకు పెద్దకొమెర్ల, అనంతరాయునిపేట, బోదుపల్లె ప్రజల వినతి

జమ్మలమడుగు రూరల్‌, జనవరి 28: ఎర్రమట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని జమ్మలమడుగు ఆర్డీవో శ్రీనివాసులుకు శుక్రవారం  మూడు గ్రామాలకు చెందిన ప్రజలు వినతి పత్రం అందజేశారు. మైలవరం మండలం పెద్దకొమెర్ల, అనంతరాయునిపేట, బోదుపల్లె గ్రామాల ప్రజలు తమ గ్రామాల పరిధిలోని సర్వే నంబరు 306లో ప్రభుత్వ పొరంబోకు భూమిలోని ఎర్రమట్టిని కొందరు అక్రమంగా తవ్వి లారీల్లో తరలిస్తున్నారన్నారు. సుమారు 20 రోజుల నుంచి పగలు, రాత్రి ఎర్రమట్టిని అక్రమంగా తరలిస్తున్నారని వారు వాపోయారు. తమ గ్రామాల చుట్టూ ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఉన్నారని, జీవాలను మేపుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. కొండప్రాంతంలో గుంతలు ఏర్పడి మట్టి తరలించడంతో పశువులకు మేత కరువైందన్నారు. మైలవరం మండలంలోని అధికారులందరికి సమస్యలు తెలిపినా ఎవరూపట్టించుకోలేదని వారు వాపోయారు. ఇప్పటికైనా అధికారులు వెంటనేచర్యలు  చేపట్టి ఎర్రమట్టి తవ్వకాలను నిలుపుదల చేయాలని డిమాండ్‌ చేశారు. 

Read more