-
-
Home » Andhra Pradesh » Kadapa » taguneeti samasya parishkarinchandi-NGTS-AndhraPradesh
-
ఏజీ గార్డెన్‌లో తాగునీటి సమస్య పరిష్కరించండి
ABN , First Publish Date - 2022-06-07T06:02:15+05:30 IST
రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఏజీ గార్డెన్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

రాయచోటిటౌన్, జూన్ 6: రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఏజీ గార్డెన్‌లో తాగునీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన సీపీఐ నేతలతో కలిసి ఆ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2011 సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఇందిరమ్మ గృహాలు నిర్మించగా ఇప్పటివరకు తాగునీరు, సిమెంటు రోడ్లు, వీధిలైట్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. 11 ఏళ్లుగా కాలనీ వాసులు ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరుగుతున్నా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి జక్కల వెంకటేష్, గిరిజన సంఘం నాయకులు పోలరి అశోక్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యులు తుమ్మల లవకుమార్, కాలనీ వాసులు పాల్గొన్నారు.