ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2022-08-18T04:39:17+05:30 IST

టీసీ కోసం వచ్చిన పాఠశాల పూర్వపు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌, పీడీ జనార్ధన్‌రెడ్డిలను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో రాఘవరెడ్డి, ఎంఈఓ వెంకటే్‌షనాయక్‌లు తెలిపారు.

ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

రాయచోటి టౌన్‌, ఆగస్టు 17: టీసీ కోసం వచ్చిన పాఠశాల పూర్వపు విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్‌, పీడీ జనార్ధన్‌రెడ్డిలను సస్పెండ్‌  చేసినట్లు డీఈవో రాఘవరెడ్డి, ఎంఈఓ వెంకటే్‌షనాయక్‌లు తెలిపారు. విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన నేపధ్యంలో బుధవారం డీఈఓ, ఎంఈవోలు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సంఘటనపై విచారించారు. ప్రదానోపాధ్యాయుడు, పీడీలు పాఠశాలకు వచ్చిన విద్యార్థినికి మాయమాటలు చెప్పి అసభ్యంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ కావడంతో వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

Read more