మమ్మల్ని ముంపులోకి చేర్చి ఆదుకోండి

ABN , First Publish Date - 2022-10-13T04:48:54+05:30 IST

గండికోట ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వల్ల ఇబ్బందులు పడుతున్నామని వెంటనే తమను ముంపులోకి చేర్చి ఆదుకోవాలని మండలంలోని కె.సుగుమంచిపల్లె గ్రామస్థులు బుధవారం తహసీల్దార్‌ శోభన్‌బాబుకు వినతిపత్రం అందించారు.

మమ్మల్ని ముంపులోకి చేర్చి ఆదుకోండి

 తహసీల్దార్‌కు కె.సుగుమంచిపల్లె వాసుల వినతి 

కొండాపురం, అక్టోబరు 12: గండికోట ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ వల్ల ఇబ్బందులు పడుతున్నామని వెంటనే తమను ముంపులోకి చేర్చి ఆదుకోవాలని మండలంలోని కె.సుగుమంచిపల్లె గ్రామస్థులు బుధవారం తహసీల్దార్‌ శోభన్‌బాబుకు వినతిపత్రం అందించారు. గ్రామంలోని గండికోట ప్రాజెక్టులో సగభాగం మాత్రమే ముంపులోకి తీసుకోవడం వల్ల మిగిలిన సగభాగంలో ఊటలు పడుతున్నాయని, ఇళ్లలో నెర్రెలు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆందోళన చేపట్టాలనుకుంటే ఆర్డీఓ పరిశీలించి వెళ్లారన్నారు. కానీ ఇంత వరకు ఇందుకు సంబంధించి ఎటువంటి పురోగతి లేదని వారు విన్నవించారు. గండికోట బ్యాక్‌వాటర్‌ ఊట వల్ల పలు ఇళ్లు కూడా కూలిపోయాయన్నారు. అదేవిధంగా బ్యాక్‌ వాటర్‌ వల్ల విషపురుగులు కూడా ఇళ్లలోకి వస్తున్నాయని, వెంటనే గ్రామాన్ని ముంపులోకి చేర్చి ఆదుకోవాలని వారు తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని అందించారు. 

Read more