యువకుడి ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2022-02-20T04:36:37+05:30 IST

కుటుంబ సమస్యలతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కడపకు చెందిన శ్రీనివాసులు అనే బాఽధితుడి ఫోన్‌కాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం

అడ్డుకున్న సైబర్‌ క్రైం ఎస్‌ఐ, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది 


కడప(క్రైం), ఫిబ్రవరి 19 : కుటుంబ సమస్యలతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని కడపకు చెందిన శ్రీనివాసులు అనే బాఽధితుడి ఫోన్‌కాల్‌తో పోలీసులు అప్రమత్తమయ్యారు. సైబర్‌ క్రైం ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, కానిస్టేబుల్‌ రెడ్డెప్ప, బ్లూకోల్ట్స్‌ సిబ్బంది అప్రమత్తమై శుక్రవారం రాత్రి 11 గంటలకు కడప రైల్వేస్టేషన్‌ వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. ఆ యువకుడు రైలు పట్టాలపై ఉన్న ఆ యువకుడిని పోలీసులు రక్షించాడు. అతడి సమస్య ఏమిటో తెలుసుకుని కౌన్సిలింగ్‌ ఇచ్చారు. యువకుడి ప్రాణాలు కాపాడిన ఎస్‌ఐ శివప్రసాద్‌రెడ్డి, సిబ్బందిని ఎస్పీ అన్బురాజన్‌ అభినందించారు. 

Read more