నియోజకవర్గ స్థాయి క్రీడల్లో విద్యార్థిని సత్తా

ABN , First Publish Date - 2022-11-02T23:41:17+05:30 IST

మండలంలోని చౌడ సము ద్రం జడ్పీ హైస్కూల్‌ విద్యార్ధిని తంబళ్లపల్లె నియోజకవర్గ స్ధా యి క్రీడా పోటీల్లో సత్తా చాటిం ది.

 నియోజకవర్గ స్థాయి క్రీడల్లో విద్యార్థిని సత్తా

2ఎంపీఎల్‌ఎంసీయూ2: ప్రతిభ చూపిన విద్యార్థినితో ఉపాధ్యాయులు

ఐదు విభాగాల్లో ప్రథమ స్థానం

ములకలచెరువు, నవంబరు 2: మండలంలోని చౌడ సము ద్రం జడ్పీ హైస్కూల్‌ విద్యార్ధిని తంబళ్లపల్లె నియోజకవర్గ స్ధా యి క్రీడా పోటీల్లో సత్తా చాటిం ది. ఐదు విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మొదటి స్థా నంలో నిలిచింది. రెండు రోజుల క్రితం కురబలకోటలో జరిగిన నియోజకవర్గ స్ధాయి క్రీడా పోటీల్లో పాఠశాలకు చెందిన విద్యార్ధిని ఆసియా షార్ట్‌పుట్‌, డిస్క్‌త్రో, బాల్‌ బ్యాడ్మింటన, 400, 600 పరుగులో మొ దటి స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా బుధవారం పాఠశాలలో జరిగిన కార్య క్రమంలో హెచఎం స్వర్ణలత, పీడీ సాజిద్‌బాషా ఆమెను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులు రేణుకా, కళ్యాణి, ప్రసూన, హసీనాబీ, మురళీమోహన, శంకర్‌ నారాయణరెడ్డి, ప్రసాద్‌, రికార్డ్‌ అసిస్టెంట్‌ మాధవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-02T23:41:17+05:30 IST
Read more