అసంఘటిత కార్మికుల కోసం పోరాటం

ABN , First Publish Date - 2022-09-11T05:18:22+05:30 IST

అసంఘటిత రంగాల్లోని కార్మికుల ప్రయో జనాల కోసం పోరాడేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్‌ అన్నారు.

అసంఘటిత  కార్మికుల కోసం పోరాటం

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 10 : అసంఘటిత రంగాల్లోని కార్మికుల ప్రయో జనాల కోసం పోరాడేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట కుతుబుద్దీన్‌ అన్నారు. శనివారం ప్రొద్దుటూరులో నిర్వహించిన సమావే శంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  అసంఘటిత కార్మిక చట్టాలను తొక్కేస్తున్నాయన్నారు. రెండు దఫాలుగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ-శ్రామిక్‌ లో పేర్లు నమోదు చేయించారని,  దాంత్లో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. ఈ అంశాలపై కార్మికులను చైతన్యపరిచి, న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడుతూ  రెండు లక్షల మందితో కార్మిక చట్టాల అమలు కోసం పోరాడుతామన్నారు. కార్మికులకు సంబంధించి రూ. 36వేల కోట్లు కేంద్రం వద్ద మూలుగుతున్నా క్షేత్ర స్థాయిలో కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదన్నారు. ఈ సమావేశంలో టీఎన్‌టీ యూసీ హిందూపురం జిల్లా అధ్యక్షుడు నాగభూషణం, రాష్ట్ర కార్యదర్శి బాలమునిరెడ్డి, పూజారి విజయచంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-11T05:18:22+05:30 IST