హేతుబద్ధీకరణ ఉత్తర్వులపై తీవ్ర వ్యతిరేకత

ABN , First Publish Date - 2022-06-13T05:29:22+05:30 IST

హేతుబద్ధీకరణ పేరుతో ఉపా ధ్యాయుల సంఖ్య తగ్గించేం దుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పీఆర్‌టీయూ క్రమశిక్షణ సం ఘం రాష్ట్ర చైర్మన్‌ కొండూరు శ్రీనివాసరాజు తెలిపారు.

హేతుబద్ధీకరణ ఉత్తర్వులపై తీవ్ర వ్యతిరేకత
సమావేశంలో మాట్లాడుతున్న కొండూరు శ్రీనివాసరాజు

 పీఆర్‌టీయూ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌ కొండూరు శ్రీనివాసరాజు

రాయచోటిటౌన్‌, జూన్‌ 12: హేతుబద్ధీకరణ పేరుతో ఉపా ధ్యాయుల సంఖ్య తగ్గించేం దుకు ప్రభుత్వం తీసుకొచ్చిన 117 జీవోను ఉపాధ్యాయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పీఆర్‌టీయూ క్రమశిక్షణ సం ఘం రాష్ట్ర చైర్మన్‌ కొండూరు శ్రీనివాసరాజు తెలిపారు. ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ  ప్రభుత్వ పాఠశాలల బలో పేతం, విద్యా ప్రమాణాల పెంపు పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, అందుకు అనుగుణంగా ఉపాధ్యాయ నియామకా లను చేపట్టకుండా, హేతుబద్దీకరణ పేరుతో ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించే యత్నాలు చేస్తుండడం దిగ్ర్భాంతికి గురి చేసిందన్నారు. 117 ఉత్తర్వులతో ప్రాథమిక పాఠశాలలన్నీ ఎక్కువ శాతం ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారి, విద్యా ప్రమాణాలు దిగజారిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు.  ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు వారానికి సగటున 36 పీరియ డ్లు బోధించగలరు. కానీ 17 సెక్షన్లకు ఒక హిందీ ఉపాధ్యాయుడు, 10 సెకన్లకు ఒక సైన్స్‌ ఉపాధ్యాయుడు బోధించడం ఎలా సాధ్యమవుతుందో ప్రభుత్వమే చెప్పాలన్నారు.  పీఆర్‌టీయూ అన్నమయ్య జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నాగేంధర్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఆర్‌వీ రమణ, మండల ప్రధాన కార్యదర్శి గోరంట్ల నాగేంద్రబాబు, నేతలు నల్లమల రామాంజనేయులు, వేణుగోపాల్‌రావు, రోశయ్య, శ్రీనివాసులు, మధుసూదన్‌ పాల్గొన్నారు.

Read more